నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల వల

నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల ఆశజూపి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి, ముఖం చాటేసిన వ్యక్తి ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 27 Sep 2022 05:36 IST

వైకాపా నాయకుల అనుచరుడి బెదిరింపులు

అనంతపురం నేరవార్తలు, న్యూస్‌టుడే: నిరుద్యోగ యువతులకు ఉద్యోగాల ఆశజూపి, వారి నుంచి డబ్బులు వసూలు చేసి, ముఖం చాటేసిన వ్యక్తి ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ మోసంపై పలువురు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ ఫక్కీరప్పకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఫిర్యాదులో రాసిన ప్రకారం... కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన నిజాముద్దీన్‌ ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆరుగురు అమ్మాయిల నుంచి రూ.4.50 లక్షలు వసూలు చేశాడు. అతను వైకాపా నాయకులతో కలిసి తిరుగుతూ, వారి పేర్లు చెబుతూ నమ్మకం కల్గించాడు. ఉద్యోగాల గురించి బాధితులు అడిగితే అదిగో ఇదిగో అంటూ 15 నెలలుగా కాలయాపన చేస్తున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న బాధితులతో ‘మీ ఇష్టమున్న చోట చెప్పుకోండి. పోలీసులు నన్ను ఏమి చేయలేరు’ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాల్లో నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు