వాగులో టెంపో పడి ఏడుగురి దుర్మరణం

హిమాచల్‌ప్రదేశ్‌ కులూ జిల్లా ఘియాగీ వద్ద వాగులోకి టెంపో దూసుకెళ్లి ఏడుగురు పర్యాటకులు మరణించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

Published : 27 Sep 2022 05:36 IST

హిమాచల్‌ప్రదేశ్‌లో దుర్ఘటన

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ కులూ జిల్లా ఘియాగీ వద్ద వాగులోకి టెంపో దూసుకెళ్లి ఏడుగురు పర్యాటకులు మరణించారు. పదిమందికి గాయాలయ్యాయి. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు. మృతుల్లో  ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన నలుగురు, మరో ముగ్గురు దిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. మరణించినవారిలో ముగ్గురు ఐఐటీ వారణాసి విద్యార్థులని, క్షతగాత్రుల్లోనూ ఆ సంస్థ పిల్లలు ఉన్నారని పోలీసులు తెలిపారు. విద్యార్థులతో సహా ఏడుగురు మరణించడం, పలువురికి గాయాలవడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ట్విటర్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.  పర్యాటకుల వాహనం ప్రమాదానికి గురికావడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని