రూ.7.8 కోట్ల మాదకద్రవ్యాలు స్వాధీనం

ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురు మహిళలు, వాటి కొనుగోలుకు యత్నించిన ఓ విదేశీయుడిని బెంగళూరు నగర నేర నియంత్రణ దళం

Published : 28 Sep 2022 04:30 IST

ఏపీ నుంచి బెంగళూరుకు సరఫరా చేస్తున్న నలుగురు మహిళలు అరెస్టు

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : ఆంధ్రప్రదేశ్‌ నుంచి మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న నలుగురు మహిళలు, వాటి కొనుగోలుకు యత్నించిన ఓ విదేశీయుడిని బెంగళూరు నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అరెస్టు చేసినట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. వారి నుంచి రూ.7.8 కోట్ల విలువైన 8 కిలోల హాష్‌ ఆయిల్‌, 10 కిలోల గంజాయి, కిలోకిపైగా ఎండీఎంఏ మాత్రలను స్వాధీనం చేసుకున్నారు. చింతపల్లి, అరకు నుంచి మాదకద్రవ్యాలు తెస్తున్నారన్న పాత నిందితుల సమాచారంతో ఆ ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. ఈనెల 24న గుండేరి పుష్పా,    బూది విజయ, దేవి, పూర్ణిమా సరకుతో విశాఖ నుంచి ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ రైలులో పుట్టపర్తి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడే సీసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు సరకు తీసుకోవాల్సిన డేవిడ్‌ పరారు కావడంతో మహిళలు ఇచ్చిన ఆధారాల మేరకు మంగళవారం బెంగళూరులో అతన్ని అరెస్టు చేశారు. ఇందులో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీసీబీ అదనపు కమిషనర్‌ రమణగుప్తా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని