సంక్షిప్త వార్తలు (3)

తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించిందొక ఎయిర్‌ హోస్టెస్‌. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకొంది. మహిళపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కాన్పుర్‌కు చెందిన

Updated : 28 Sep 2022 06:12 IST

అత్యాచారం చేసిన వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పిన ఎయిర్‌ హోస్టెస్‌

దిల్లీ: తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని ధైర్యంగా బంధించి పోలీసులకు పట్టించిందొక ఎయిర్‌ హోస్టెస్‌. ఈ ఘటన దిల్లీలో చోటు చేసుకొంది. మహిళపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కాన్పుర్‌కు చెందిన హర్‌జీత్‌ యాదవ్‌గా గుర్తించారు. అతడొక పార్టీకి చెందిన నేతగా తేలింది. హర్‌జిత్‌తో బాధితురాలికి నెలన్నరగా పరిచయం ఉంది. ఈ క్రమంలో అతడు ఆదివారం మత్తుపదార్థాలు సేవించి ఆ ఎయిర్‌ హోస్టెస్‌ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అతడిని బంధించి సాయం కోసం 112 నంబర్‌కు కాల్‌ చేసింది. బాధితురాలి వాంగ్మూలం మేరకు హర్‌జిత్‌ను పోలీసులు అరెస్టు చేసి..కోర్టు ఆదేశాల ప్రకారం కస్టడీకి తరలించారు.


నల్లనిదానివంటూ భర్త అవహేళన.. గొడ్డలితో హతమార్చిన భార్య

దుర్గ్‌(ఛత్తీస్‌గఢ్‌): నువ్వు నల్లగా ఉంటావు అంటూ భర్త పదేపదే తనను అవహేళన చేస్తుండటాన్ని ఆ భార్య భరించలేకపోయింది. తాళికట్టిన పెనిమిటే అయినా అతన్ని గొడ్డలితో నరికి చంపింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ దుర్గ్‌ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమలేశ్వర్‌ గ్రామానికి చెందిన అనంత్‌ సాన్‌వాని(40) నల్లగా ఉన్న తన భార్య సంగీతను అసహ్యంగా పిలిచేవాడు. ఆమె శరీరఛాయపై అవహేళన చేసేవాడు. దీంతో వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి వారిద్దరి మధ్య మాటామాటా పెరిగింది. దీంతో ఉద్రేకం పట్టలేని సంగీత తన భర్తపై ఇంట్లోని గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది. అంతేకాకుండా అతడి జననాంగాలను కోసేసింది. సోమవారం ఉదయం తన భర్తను ఎవరో హతమార్చారంటూ గ్రామస్థులకు చెప్పింది. అయితే పోలీసు విచారణలో తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.


బక్సర్‌ రైల్వేస్టేషన్‌లో వివాహితపై అకృత్యం

బిహార్‌లోని బక్సర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ వివాహిత అత్యాచారానికి గురైంది. స్థానికులు.. బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలం తమ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోకి రాదని బక్సర్‌ సిటీ పోలీసులు, రైల్వే పోలీసులు ఎవరూ ఆసుపత్రికి చేరుకోలేదు. అత్యాచారం జరిగిన తర్వాత రైల్వే అధికారులకు ఫోన్‌ చేసినా స్పందించలేదని బాధితురాలు తెలిపింది. ఈ విషయం రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి చేరడం వల్ల ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని