కుమారుడు తినే అన్నంలో విషం కలిపిన తండ్రి

పొలం విక్రయించొద్దని అడ్డు చెప్పినందుకు కన్న కుమారుడినే కడతేర్చేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి. కుమారుడు తినే అన్నంలో క్రిమిసంహారక మందు కలిపాడు. ఒకటి రెండు ముద్దలు తినగానే

Updated : 28 Sep 2022 06:11 IST

మోమిన్‌పేట: పొలం విక్రయించొద్దని అడ్డు చెప్పినందుకు కన్న కుమారుడినే కడతేర్చేందుకు ప్రయత్నించాడు ఓ తండ్రి. కుమారుడు తినే అన్నంలో క్రిమిసంహారక మందు కలిపాడు. ఒకటి రెండు ముద్దలు తినగానే తేడా గమనించిన కొడుకు అప్రమత్తం కావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట ఠాణా పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్కతల గ్రామానికి చెందిన ఉప్పరి పెంటయ్య, గోవిందమ్మ దంపతుల పెద్ద కొడుకు వెంకటేశం (24) ఇంటివద్దే ఉంటున్నాడు.జల్సాలకు అలవాటు పడిన పెంటయ్య తనకున్న 5 ఎకరాల భూమిలో కొంత అమ్మేందుకు ఇటీవల సిద్ధమయ్యాడు. భూమిని విక్రయించొద్దని వెంకటేశం స్పష్టం చేశాడు. దీంతో ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న పెంటయ్య శనివారం సాయంత్రం కొడుకు తినే ఆహారంలో క్రిమి సంహారక రసాయన మందు కలిపాడు. అది తిన్న వెంకటేశం వాసనను గుర్తించి తల్లిని తినొద్దని హెచ్చరించాడు. అనంతరం తన స్నేహితుడికి తెలపగా.. ఆయన తన కారులో వెంకటేశంను వికారాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స చేయడంతో వెంకటేశంకు ప్రాణాపాయం తప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని