మరుగుదొడ్డి అనుకొని.. బోగీ తలుపు తీసి..

రైలులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి నిద్రమత్తులో మరుగుదొడ్డిగా భావించి బోగీ తలుపు తీయడంతో కింద పడి తీవ్రంగా గాయపడింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం..

Published : 28 Sep 2022 04:41 IST

రైలు నుంచి కింద పడి చిన్నారికి తీవ్ర గాయాలు

పెద్దపల్లి, న్యూస్‌టుడే: రైలులో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి నిద్రమత్తులో మరుగుదొడ్డిగా భావించి బోగీ తలుపు తీయడంతో కింద పడి తీవ్రంగా గాయపడింది. బాధిత కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సూర్యాపేటకు చెందిన భూక్యా ప్రభుదాస్‌, కవిత దంపతులు.. వారి కుమార్తె లావణ్య(7) సహా దాదాపు 40 మంది బంధువులు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున పెద్దపల్లి స్టేషన్‌కు దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. లావణ్య మరుగుదొడ్డికి వెళ్లాలనుకుని బోగీ తలుపు తీసి.. ట్రాక్‌ పక్కన పడిపోయింది. వెంటనే తల్లి పెద్దగా అరవడంతో ఇతర ప్రయాణికులు చైన్‌ లాగి రైలును ఆపారు.  చిన్నారిని కరీంనగర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని