గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు మూడేళ్ల జైలుశిక్ష

జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు పాతికేళ్ల కిందటి నకిలీ పాస్‌పోర్టు కేసులో యూపీ కోర్టు మంగళవారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల కేసులో తన

Updated : 28 Sep 2022 06:07 IST

నకిలీ పాస్‌పోర్టు కేసులో యూపీ కోర్టు తీర్పు

లఖ్‌నవూ: జైలులో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అబూ సలేంకు పాతికేళ్ల కిందటి నకిలీ పాస్‌పోర్టు కేసులో యూపీ కోర్టు మంగళవారం మూడేళ్ల జైలుశిక్ష విధించింది. 1993 నాటి ముంబయి వరుస పేలుళ్ల కేసులో తన పాత్రకుగాను అబూ సలేం నవీ ముంబయిలోని తలోజా జైలులో జీవితఖైదు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. తాజా విచారణకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా హాజరైన అబూ సలేంతోపాటు అతడి సహాయకుడు మహ్మద్‌ పర్వేజ్‌ ఆలంకు మూడేళ్ల శిక్ష విధిస్తూ స్పెషల్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ సమ్రిద్ధి మిశ్ర తీర్పు చెప్పారు. ఇప్పటికే అనుభవిస్తున్న జైలుశిక్షలో దీనిని సర్దుబాటు చేస్తారు. జైలుశిక్షకు తోడు అబూ సలేంకు రూ.10 వేలు, పర్వేజ్‌ ఆలంకు రూ.35 వేల జరిమానాను కోర్టు విధించింది. కోర్టుకు హాజరైన ఆలంకు రెండు రూ.20 వేల పూచీకత్తులతో మధ్యంతర బెయిలు మంజూరు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని