విడాకులు అడిగిందని నడిరోడ్డుపై భార్య హత్య

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని చెంబూర్‌లో విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. ట్యాక్సీ డ్రైవర్‌ ఇక్బాల్‌.. పిల్లలు పుట్టలేదని మొదటి భార్యను

Published : 29 Sep 2022 04:54 IST

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని చెంబూర్‌లో విడాకులు అడిగిందని భార్యను నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడో వ్యక్తి. ట్యాక్సీ డ్రైవర్‌ ఇక్బాల్‌.. పిల్లలు పుట్టలేదని మొదటి భార్యను వదిలేసి రూపాలీ అనే మహిళను మూడేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వేరే మతానికి చెందిన ఆమెను బురఖా వేసుకోవాలని, ఇతర ముస్లిం సంప్రదాయాలనూ పాటించాలంటూ ఇక్బాల్‌ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. దీన్ని తట్టుకోలేని రూపాలీ తన కుమారుడిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది. దాదర్‌లోని ఓ హాస్టల్‌లో తన స్నేహితురాలితో కలిసి నివసిస్తోంది. ఇక్బాల్‌ నుంచి విడాకులు కోరుకుంది. అయితే కుమారుడి విషయమై మాట్లాడాలని సోమవారం రూపాలీని ఇక్బాల్‌ బయటకు రమ్మని పిలిచాడు. అలా వచ్చిన రూపాలీని నడిరోడ్డుపై కత్తితో అతి దారుణంగా పొడిచాడు. గాయాల తీవ్రతతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన ఇక్బాల్‌ను కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts