మామ మర్మాంగాన్ని కోసేసింది!

పశ్చిమబెంగాల్‌లోని మైనా జిల్లాలో పుట్టింటికి వెళ్లొద్దన్నారన్న కోపంతో ఓ మహిళ తన మామ మర్మాంగాలను కోసి పడేసింది. తూర్పు మేదినీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన శిఖా అనే మహిళను మాంసం కూరతో భోజనం చేసేందుకు

Published : 29 Sep 2022 06:47 IST

భర్త మీద కోపంతో  ఓ మహిళ దుశ్చర్య

పశ్చిమబెంగాల్‌లోని మైనా జిల్లాలో పుట్టింటికి వెళ్లొద్దన్నారన్న కోపంతో ఓ మహిళ తన మామ మర్మాంగాలను కోసి పడేసింది. తూర్పు మేదినీపుర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధికి చెందిన శిఖా అనే మహిళను మాంసం కూరతో భోజనం చేసేందుకు రమ్మని ఆమె తండ్రి ఫోన్‌ చేశాడు. వెంటనే ఆమె తన భర్తకు కాల్‌ చేయగా.. అతడు వెళ్లవద్దని చెప్పాడు. తానే చికెన్‌ తెస్తానని.. ఇంట్లోనే వండుకుని తిందామని తెలిపాడు. దీంతో కోపంతో కాల్‌ కట్‌ చేసిన ఆ మహిళ తన అత్తామామలను తీవ్రంగా దూషించింది. అది కాస్తా వాగ్వాదానికి దారితీసింది. ఉద్రేకంతో ఊగిపోయిన శిఖా విచక్షణ కోల్పోయి తన మామ మర్మాంగాన్ని కత్తితో కోసిపడేసింది. అతడిని స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి మహిళను బంధించారు. ఆమె విడిపించుకుని కన్నవారింటికి పారిపోయింది. నిందితురాల్ని అరెస్టు చేసిన పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts