ఆరున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ దందాలు

గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు, మాజీ నక్సలైట్‌ మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్నకు బుధవారం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్‌

Published : 29 Sep 2022 04:54 IST

మాజీ నక్సలైట్‌ శేషన్న రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం అనుచరుడు, మాజీ నక్సలైట్‌ మద్దునూరి శేషయ్య అలియాస్‌ శేషన్నకు బుధవారం నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పలు విషయాలు పొందుపరిచారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న శేషన్నకు అయిదుగురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. నక్సల్స్‌ ఉద్యమంలో 15 మంది కమాండర్స్‌తో కలిసి పనిచేశాడని, మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలున్నాయని వెల్లడించారు. అప్పట్లో నక్సలైట్‌ దళ కమాండర్‌గా ఉన్న శాఖమూరి అప్పారావు రూ.4.5 లక్షలు ఇవ్వగా, రూ.50 వేలతో ఆటో కొని, మిగిలిన సొమ్మును శేషన్న దాచుకున్నట్లు రిపోర్ట్‌లో పేర్కొన్నారు. నక్సలైట్‌గా ఉన్న సమయంలో దాచిన ఆయుధాలను విక్రయించి సొమ్ము చేసుకున్నాడని, ఆరున్నరేళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ దందాలు సాగించాడని తెలిపారు. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో పెద్దఎత్తున దందాలు సాగించినట్లు వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts