పేలిన విద్యుత్తు వాహన బ్యాటరీ

ఛార్జింగ్‌ చేసిన విద్యుత్తు వాహనం (ఈవీ) బ్యాటరీ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్‌ దగ్ధమయ్యాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 29 Sep 2022 04:54 IST

రెండు ద్విచక్ర వాహనాలు, సైకిల్‌ దగ్ధం

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే: ఛార్జింగ్‌ చేసిన విద్యుత్తు వాహనం (ఈవీ) బ్యాటరీ నుంచి మంటలు చెలరేగడంతో పక్కనే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలు, ఒక సైకిల్‌ దగ్ధమయ్యాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వనపర్తి న్యూటౌన్‌ కాలనీలోని ఓ ఇంట్లో ఖాసీం, విష్ణు, రాములు అద్దెకు ఉంటున్నారు. వీరిలో విష్ణు స్నేహితుడు కిశోర్‌ ఆ ఇంటి ఆవరణలో తన ఎలక్ట్రిక్‌ వాహనాన్ని ఛార్జింగ్‌ చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ వాహనంలోని బ్యాటరీ పేలిపోయి మంటలు చెలరేగాయి. ఆ మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఖాసీం, విష్ణు ద్విచక్రవాహనాలు, ఓ సైకిల్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. సమీపంలో ఉన్న విద్యుత్తు మీటర్లు, తలుపులు కూడా కొంతమేరకు కాలిపోయాయి. ఇంటిపై భాగంలో నిద్రిస్తున్నవారు భయాందోళనకు గురై తాళ్ల సాయంతో కిందికి దిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రూ.3.40 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని