ఏసీబీకి చిక్కిన ముగ్గురు రెవెన్యూ ఉద్యోగులు

భూముల మ్యుటేషన్‌, పాస్‌ పుస్తకాల మంజూరుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కోసం లంచాలు తీసుకుంటూ వేర్వేరు జిల్లాల్లో రెవెన్యూ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు

Published : 29 Sep 2022 04:54 IST

ఈనాడు, అమరావతి: భూముల మ్యుటేషన్‌, పాస్‌ పుస్తకాల మంజూరుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన కోసం లంచాలు తీసుకుంటూ వేర్వేరు జిల్లాల్లో రెవెన్యూ శాఖకు చెందిన ముగ్గురు ఉద్యోగులు బుధవారం ఏసీబీకి చిక్కారు. నెల్లూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం తహసీల్దార్‌ కాయల సతీష్‌ రూ.10 వేలు, అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మునగపూడి బెన్నవరం సచివాలయ వీఆర్‌వో జి.సూర్యనారాయణ రూ.20వేలు, గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం వరగాని వీఆర్‌వో ఎస్‌కే మౌలాలి రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయారు. ఏసీబీకి వచ్చిన ఫిర్యాదులు ఆధారంగా వీరిని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts