ఐదుగురు రుణయాప్‌ మోసగాళ్ల అరెస్టు

రుణయాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పి.జాషువా వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు

Published : 30 Sep 2022 05:37 IST

మచిలీపట్నం క్రైం, న్యూస్‌టుడే: రుణయాప్‌ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. మచిలీపట్నంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పి.జాషువా వివరాలు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన సోదరులు రాహుల్‌ సింగ్‌, రోహిత్‌ కుమార్‌, అయోధ్య జిల్లాకు చెందిన జయశంకర్‌ ఉపాధ్యాయ, దిల్లీకి చెందిన అభిషేక్‌ కుమార్‌ సిన్హా, హైదరాబాద్‌ వాసి అక్తర్‌ హుస్సేన్‌లను పట్టుకున్నామని, వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకూ నమోదైన 5 కేసుల్లో 15 బ్యాంకు ఖాతాల ద్వారా రూ.91.84 లక్షల లావాదేవీలు నిర్వహించినట్టు గుర్తించామని, ఆ ఖాతాల్లో ఉన్న రూ.23.33 లక్షలను నిలిపేశామని వివరించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts