8 వేల క్వింటాళ్ల రేషన్‌ బియ్యం మాయం

నిరుపేదల ఆకలి తీర్చే రేషన్‌ బియ్యాన్ని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అక్రమార్కులు భారీస్థాయిలో పక్కదారి పట్టించారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో ఏకంగా 8,399

Updated : 30 Sep 2022 06:33 IST

ఆసిఫాబాద్‌లో 40 లారీల దారిమళ్లింపు

ఏడు నెలలుగా సాగిన అక్రమం

విలువ రూ. 3 కోట్లని అంచనా

ఈనాడు డిజిటల్‌, ఆసిఫాబాద్‌: నిరుపేదల ఆకలి తీర్చే రేషన్‌ బియ్యాన్ని కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో అక్రమార్కులు భారీస్థాయిలో పక్కదారి పట్టించారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో ఏకంగా 8,399 క్వింటాళ్ల బియ్యానికి లెక్కలు లేకపోవడం తనిఖీ అధికారులను నివ్వెరపరిచింది. 40 లారీల్లో సరకును కొల్లగొట్టి విక్రయించారని ప్రాథమికంగా గుర్తించారు. దీని విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గత ఏడు నెలలుగా ప్రతి నెల అయిదారు లారీల చొప్పున బియ్యాన్ని పక్కదోవ పట్టించినట్లు సమాచారం. నాలుగు రోజుల కిందట జిల్లా ఉన్నతాధికారికి ఈ విషయం తెలియడంతో గురువారం తనిఖీలు చేయగా, అక్రమాలు వెల్లడయ్యాయి. జిల్లాలో మొత్తం అయిదు మండలస్థాయి నిల్వ (ఎంఎల్‌ఎస్‌) కేంద్రాలున్నాయి. ప్రతి నెలా 2,500 టన్నుల బియ్యం జిల్లాకు కేటాయిస్తున్నారు. ఆసిఫాబాద్‌ ఎంఎల్‌ఎస్‌ గోదాం ఇన్‌ఛార్జి, లారీల్లో బియ్యం తెచ్చే గుత్తేదారు కుమ్మక్కై సరకును నేరుగా బయట విక్రయించి సొమ్ము చేసుకున్నారని సమాచారం.

స్టేజ్‌-1లో కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట నుంచి కుమురం భీం జిల్లాలోని ఎంఎల్‌ఎస్‌ కేంద్రాలకు బియ్యం వస్తాయి. స్టేజ్‌ -2 లో ఇక్కడి నుంచి రేషన్‌ డీలర్లకు వెళ్తాయి. స్టేజ్‌ వన్‌లో బియ్యాన్ని గోదాంలలో నేరుగా డంప్‌ చేయాలి. ఈ క్రమంలోనే గోదాముకు రాకుండానే బియ్యం దారి మళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం మాట్లాడుతూ డీఆర్వో సురేష్‌ అధ్వర్యంలో ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేసి, బియ్యాన్ని పక్కదారి పట్టించిన వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts