ప్రేయసిని చంపి పారిపోతూ.. ట్రక్కు ఢీకొని మృతి

విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేందుకు ఇదో ఉదాహరణ. తుపాకీతో కాల్పులు జరిపి ప్రేయసి ప్రాణం తీసిన ఓ ఉన్మాది... అక్కడి నుంచి పారిపోతూ ట్రక్కు ఢీకొని చనిపోయాడు! మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ

Updated : 30 Sep 2022 09:36 IST

విధిని ఎవ్వరూ తప్పించుకోలేరు అనేందుకు ఇదో ఉదాహరణ. తుపాకీతో కాల్పులు జరిపి ప్రేయసి ప్రాణం తీసిన ఓ ఉన్మాది... అక్కడి నుంచి పారిపోతూ ట్రక్కు ఢీకొని చనిపోయాడు! మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో ఈ ఘటన చోటుచేసుకొంది. కృష్ణయాదవ్‌ అనే వ్యక్తి... నేహా అనే యువతిని ప్రేమించాడు. అయితే, వారి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి.బుధవారం మధ్యాహ్నం బోయిసర్‌లోని రైల్వే ఫ్లైఓవర్‌ కింద ఉన్న నేహాపై...కృష్ణయాదవ్‌ తుపాకీతో గురిపెట్టాడు. తలపై కాల్పులు జరపడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నిందితుడు ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోతుండగా మొదట ఓ కారు ఢీకొట్టింది. అయినాసరే దాన్ని తప్పించుకుని పరుగు పరుగున ఇంకా ముందుకు వెళ్తుండగా... ఆర్మీకి చెందిన ఓ ట్రక్కు ఎదురుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. గాయపడిన అతడిని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా, చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని