Honeytrap: మాట్లాడదామంటూ గదిలోకి తీసుకెళ్లి.. వీడియో తీయించి..!

సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకొని ‘వలపు’ ఉచ్చులో వారిని బంధించాక రూ.లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెల్లలో ఈ ముఠా రూ.40 లక్షలదాకా వసూళ్లకు

Updated : 30 Sep 2022 06:59 IST

శ్రీనగర్‌: సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎంపిక చేసుకొని ‘వలపు’ ఉచ్చులో వారిని బంధించాక రూ.లక్షల వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాను జమ్మూకశ్మీర్‌ పోలీసులు అరెస్టు చేశారు. గత ఆర్నెల్లలో ఈ ముఠా రూ.40 లక్షలదాకా వసూళ్లకు పాల్పడినట్లు పోలీసు అధికారులు గురువారం వెల్లడించారు. రూ.8 లక్షలు ఇవ్వకపోతే ‘రహస్య’ వీడియో బయటపెడతామని ఓ ముఠా బెదిరిస్తోందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు చేసిన ఫిర్యాదుతో పోలీసులు ఈ కూపీ లాగారు.

భార్యాభర్తలైన శాయిస్తా బషీర్‌, ఐజాజ్‌ అహ్మద్‌ గనీలతోపాటు జహంగీర్‌ అహ్మద్‌ దార్‌ అనే మరో వ్యక్తిని అరెస్టు చేశారు. ఆపదలో ఉన్నట్లు శాయిస్తా చేసిన ఫోనుతో వారి ఇంటికి వెళ్లిన అధికారిని మాట్లాడే మిషతో ఆమె పడకగదిలోకి తీసుకువెళ్లింది. లోనికి చొరబడిన ఐజాజ్‌, జహంగీర్‌.. ఆ ఇద్దరినీ కలిపి వీడియో తీశారు. అడిగిన డబ్బు ఇవ్వకపోతే ఈ వీడియోను వైరల్‌ చేస్తామని బెదిరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని