వర్గల్‌లో వేణుగోపాలస్వామి పంచలోహ విగ్రహం చోరీ

సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండల కేంద్రంలోని 700 ఏళ్ల చరిత్ర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. రోజూ మాదిరిగానే ఆలయార్చకులు జగన్నాథాచార్యులు, మురళీధరశర్మ గురువారం రాత్రి 8 గంటలకు గుడి తాళాలు వేసి వెళ్లారు.

Published : 01 Oct 2022 05:52 IST

వర్గల్‌, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండల కేంద్రంలోని 700 ఏళ్ల చరిత్ర ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలో పంచలోహ విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. రోజూ మాదిరిగానే ఆలయార్చకులు జగన్నాథాచార్యులు, మురళీధరశర్మ గురువారం రాత్రి 8 గంటలకు గుడి తాళాలు వేసి వెళ్లారు. శుక్రవారం వేకువజామున మురళీధరశర్మ వచ్చి చూడగా ఆలయం తలుపులు తెరచి.., తాళం, గొళ్లెం ధ్వంసం చేసి ఉన్నాయి. లోపల వేణుగోపాలస్వామి ఉత్సవ విగ్రహం కనిపించలేదు. లోపల రుక్మిణి, సత్యభామ పంచలోహ విగ్రహాలు మాత్రం అక్కడే ఉన్నాయి. గజ్వేల్‌ ఏసీపీ రమేశ్‌, సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ క్లూస్‌టీంతో వచ్చి వివరాలు సేకరించారు. గుడిలో సీసీ కెమేరాలు లేవు. చుట్టుపక్కల గ్రామాల్లోని సీసీ కెమేరాల దృశ్యాలను చూసి నిందితులను పట్టుకుంటామని అధికారులు చెప్పారు. బయటి వ్యక్తులతో పాటు స్థానికుల సహకారంతోనే విగ్రహం అపహరించి ఉండవచ్చని పేర్కొన్నారు. అర్చకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతున్న సమయంలో స్వామివారి పంచలోహ విగ్రహం దొంగతనానికి గురవ్వడం బాధాకరమని ఉత్సవ కమిటీ నిర్వాహకుడు టేకుపల్లి రాంరెడ్డి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని