గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. మహిళా మావోయిస్టు మృతి

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాపెవాంచ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్‌ గోయల్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు.

Published : 01 Oct 2022 05:52 IST

బల్లార్ష, న్యూస్‌టుడే: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా కాపెవాంచ అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మహిళా మావోయిస్టు మృతిచెందింది. గడ్చిరోలి జిల్లా ఎస్పీ అంకిత్‌ గోయల్‌ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్పీ తెలిసిన వివరాల ప్రకారం.. అహెరీ, పెరిమలి దళాలకు చెందిన సుమారు 30 నుంచి 40 మంది సభ్యులు కాంపెవాంచ అడవుల్లో సమావేశమైనట్లు సమాచారం అందింది. ఈ మేరకు రెండు రోజుల కిత్రం ప్రత్యేక దళాల ఆధ్వర్యంలో కూంబింగ్‌ చేపట్టగా.. పోలీసులపై మావోయిస్టులు ఎదురుకాల్పులకు దిగారు. లొంగిపోవాలంటూ ప్రత్యేక బలగాలు మావోయిస్టులను హెచ్చరిస్తూ ముందుకుసాగారు. కొంతదూరంలో పోలీసులకు ఓ మహిళా మావోయిస్టు మృతదేహం కనిపించింది. అక్కడే ఓ తుపాకీ, కొన్ని మారణాయుధాలు, ఇతర సామగ్రి లభించింది. మృతదేహాన్ని హెలికాప్టర్‌ సాయంతో గడ్చిరోలికి తరలించారు. ఆమె వివరాలు గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని