బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడి డిస్మిస్‌

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించి పోక్సో చట్టం కింద అరెస్టయిన ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించి చిత్తూరు డీఈవో పురుషోత్తం శనివారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు.

Published : 02 Oct 2022 04:29 IST

చిత్తూరు విద్య, న్యూస్‌టుడే: బాలికలతో అసభ్యంగా ప్రవర్తించి పోక్సో చట్టం కింద అరెస్టయిన ఉపాధ్యాయుడిని శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. ఈ సంఘటనకు సంబంధించి చిత్తూరు డీఈవో పురుషోత్తం శనివారం తన కార్యాలయంలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. బంగారుపాళ్యం మండలం చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు టి.అబు (58) పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఏప్రిల్‌ 29న పాఠశాల ఎదుట తల్లిదండ్రులు ధర్నా చేపట్టారు. స్పందించిన కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశాల మేరకు ఆర్డీవో పద్మావతి, తాము పాఠశాలకు వెళ్లి విచారించామని డీఈవో వివరించారు. దీనిపై కలెక్టర్‌కు నివేదించామని, అదే రోజు పోక్సో చట్టం కింద ఉపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారని తెలిపారు. ఆపై ఆయన బెయిల్‌పై విడుదలయ్యారని, న్యాయస్థానంలో కేసు నడుస్తోందని చెప్పారు. మరోసారి విచారించాలని ఆర్డీవో, ఐసీడీఎస్‌ అధికారిణిని కలెక్టర్‌ ఆదేశించారని అన్నారు. ఉపాధ్యాయుడు పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా ప్రధానోపాధ్యాయురాలు పార్వతి పట్టించుకోలేదని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారని తెలిపారు. దీంతో పార్వతిని విధులనుంచి తాత్కాలికంగా తొలగించామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని