ఆ వికృత చేష్టలకు 12 ఏళ్ల పసిప్రాణం బలి

దేశ రాజధాని దిల్లీలో గత నెలలో చోటుచేసుకున్న అత్యంత క్రూరమైన సామూహిక అత్యాచార ఘటనలో బాధితుడైన 12 ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న ఆ బాలుడు పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు.

Published : 02 Oct 2022 04:59 IST

ఆసుపత్రిలో ప్రాణాలు విడిచిన ‘సామూహిక అత్యాచార’ బాధితుడు

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో గత నెలలో చోటుచేసుకున్న అత్యంత క్రూరమైన సామూహిక అత్యాచార ఘటనలో బాధితుడైన 12 ఏళ్ల బాలుడు కొన్ని రోజులుగా మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌ మీద చికిత్స పొందుతున్న ఆ బాలుడు పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. గత నెల 17న బాలుడిపై 10-12 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లు అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డారు. బాలుడి రహస్య భాగంలో రాడ్డును దూర్చి ఇటుకలతో కొట్టి తీవ్రంగా హింసించారు. ఈ వికృత చర్యల కారణంగా బాలుడు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో ఆసుపత్రిలో చేర్చారు. బాధిత బాలుడి మరణంపై దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని