Cheating: నిత్యపెళ్లికొడుకు.. 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు..!

మూడు పదుల వయసు నిండకముందే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడో యువకుడు. రోజుకో కొత్త పేరుతో తిరుగుతూ యువతులను మభ్యపెట్టి పెళ్లిచేసుకునేవాడు. అప్పటికే 23 మందిని వివాహమాడి మోసగించిన అసబుల్‌ మొల్లా అనే వ్యక్తి పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు.

Updated : 02 Oct 2022 07:37 IST

పశ్చిమబెంగాల్‌: మూడు పదుల వయసు నిండకముందే నిత్య పెళ్లికొడుకు అవతారం ఎత్తాడో యువకుడు. రోజుకో కొత్త పేరుతో తిరుగుతూ యువతులను మభ్యపెట్టి పెళ్లిచేసుకునేవాడు. అప్పటికే 23 మందిని వివాహమాడి మోసగించిన అసబుల్‌ మొల్లా అనే వ్యక్తి పశ్చిమబెంగాల్‌లోని సాగర్‌దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు. అనంతరం ఇంట్లో నుంచి నగలు తీసుకుని పారిపోయాడు. ఈ మోసంపై బాధితురాలు సాగర్‌దిగీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిత్య పెళ్లికొడుకు నిర్వాకం బయటపడింది. నిందితుడు పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు. 24వ భార్య మాత్రం ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతణ్ని పోలీసులు అరెస్టుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని