మైనర్‌పై రెండేళ్లు అత్యాచారం.. దోషికి 142 ఏళ్ల శిక్ష

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తికి 142 ఏళ్ల కఠిన శిక్ష విధించింది పోక్సో కోర్టు. కేరళలోని పథనంతిట్ట జిల్లాకు చెందిన పదేళ్ల బాధితురాలిపై ఆమెకు బంధువైన నిందితుడు ఆనందన్‌ పీఆర్‌(41) 2019 నుంచి 2021 వరకు లైంగిక దాడులకు పాల్పడేవాడని కోర్టు నిర్ధరించింది.

Published : 02 Oct 2022 04:59 IST

బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ వ్యక్తికి 142 ఏళ్ల కఠిన శిక్ష విధించింది పోక్సో కోర్టు. కేరళలోని పథనంతిట్ట జిల్లాకు చెందిన పదేళ్ల బాధితురాలిపై ఆమెకు బంధువైన నిందితుడు ఆనందన్‌ పీఆర్‌(41) 2019 నుంచి 2021 వరకు లైంగిక దాడులకు పాల్పడేవాడని కోర్టు నిర్ధరించింది. పోక్సో, ఐపీసీ 506 సెక్షన్‌ ప్రకారం నమోదైన కేసులపై నిందితుడికి 142 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ.. పథనంతిట్ట అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు(ప్రిన్సిపల్‌ పోక్సో) జడ్జి జయకుమార్‌ జాన్‌ తీర్పు చెప్పారు. శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడేళ్లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని