భూమి పట్టా కాలేదని బలవన్మరణం

వారసత్వంగా వచ్చిన భూమి గత కొన్ని సంవత్సరాలుగా కాస్తులో ఉన్నప్పటికీ అధికారులు పట్టా ఇవ్వకపోవడంతో పాటు ధరణిలో నమోదు కాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా నల్ల వెంకయ్యపల్లిలో జరిగింది.

Published : 03 Oct 2022 04:34 IST

శంకరపట్నం, న్యూస్‌టుడే: వారసత్వంగా వచ్చిన భూమి గత కొన్ని సంవత్సరాలుగా కాస్తులో ఉన్నప్పటికీ అధికారులు పట్టా ఇవ్వకపోవడంతో పాటు ధరణిలో నమోదు కాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లా నల్ల వెంకయ్యపల్లిలో జరిగింది. కేశవపట్నం ఎస్సై దేశ్‌ చంద్రశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంకరపట్నం మండలం మొలంగూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని నల్ల వెంకయ్యపల్లి గ్రామానికి చెందిన కలాలి శ్రీనివాస్‌రెడ్డి(36) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. తనకు వారసత్వంగా వచ్చిన 34 గుంటల భూమికి పట్టా ఇవ్వడంతో పాటు ధరణిలో నమోదు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరిగాడు. సరైన ఆధారాలు లేవంటూ అధికారులు తిరస్కరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్‌రెడ్డి గత నెల 30న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు తొలుత హుజూరాబాద్‌కు, అనంతరం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని