రుణయాప్‌లలో కొత్త కోణం

రుణ యాప్‌ల నిర్వాహకులు కమీషన్‌ ఆశ చూపించి కొందరి బ్యాంకు ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాటి ద్వారా రుణాల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. ‘రుణ యాప్‌ల నిర్వాహకులు కమీషన్‌ ఇస్తామని మభ్యపెట్టి సామాన్యుల ఖాతాలను వినియోగించుకుంటున్నట్లు గుర్తించాం.

Updated : 04 Oct 2022 04:24 IST

నిర్వాహకులకు బ్యాంకు ఖాతాలు ‘అమ్ముకున్న’ అమాయకులు
అయిదుగురు నిందితుల అరెస్టు

ఏలూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: రుణ యాప్‌ల నిర్వాహకులు కమీషన్‌ ఆశ చూపించి కొందరి బ్యాంకు ఖాతాలను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. వాటి ద్వారా రుణాల లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తేలింది. ఏలూరు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ సోమవారం ఈ వివరాలు వెల్లడించారు. ‘రుణ యాప్‌ల నిర్వాహకులు కమీషన్‌ ఇస్తామని మభ్యపెట్టి సామాన్యుల ఖాతాలను వినియోగించుకుంటున్నట్లు గుర్తించాం. 5 శాతం కమీషన్‌ ఆశ చూపి విశాఖకు చెందిన కేతాడి వెంకటేశ్‌కు ఖాతా తీసుకుని రూ.1.63కోట్ల లావాదేవీలు జరిపారు. హైదరాబాద్‌కు చెందిన కటిక సందీప్‌ తన హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాను వీరికి అమ్మాడు. అందులో రూ. 90.15 లక్షల లావాదేవీలు నిర్వహించారు. చెన్నైకు చెందిన అరుణ్‌ యాక్సిస్‌ బ్యాంకు ఖాతాను వీరికి అప్పగించాడు. మదురైకి చెందిన నాగముత్తు తన స్నేహితుడు విఘ్నేష్‌ ద్వారా తన ఖాతాను నిర్వాహకులకు ఇచ్చాడు. యాప్‌ల ద్వారా రుణాలు ఇచ్చి వేధిస్తున్న అసలు నిందితులు పరారీలో ఉన్నారు’ అని ఎస్పీ తెలిపారు. యాప్‌ల నిర్వాహకులకు తమ ఖాతాలను ఇచ్చి సహకరించిన ఈ అయిదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని