వరంగల్‌ పోలీసుల అదుపులో ఎన్‌ఐఏ నకిలీ అధికారులు!

జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులమంటూ వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురిని బెదిరించిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు, కరీంనగర్‌కు చెందిన మరో ఇద్దరు కలిసి నాలుగు రోజుల క్రితం వరంగల్‌కు వచ్చారు.

Updated : 04 Oct 2022 04:17 IST

పీఎఫ్‌ఐతో సంబంధాలు ఉన్నాయంటూ స్థిరాస్తి వ్యాపారులకు బెదిరింపులు

భీమారం, వరంగల్‌ క్రైం, న్యూస్‌టుడే: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారులమంటూ వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పలువురిని బెదిరించిన ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు, కరీంనగర్‌కు చెందిన మరో ఇద్దరు కలిసి నాలుగు రోజుల క్రితం వరంగల్‌కు వచ్చారు. ఇక్కడ భూ దందాలు, స్థిరాస్తి వ్యాపారాలు చేస్తున్న వారి వద్దకు వెళ్లి ‘మీకు నిషేధిత పీఎఫ్‌ఐ సంస్థతో సంబంధాలున్నాయి.. మేం ఎన్‌ఐఏ అధికారులం’ అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో వారు గతంలో తాము చేసిన అక్రమాలను వెల్లడించినట్లు సమాచారం. ప్రధాన నిందితుడు నల్గొండలో కొందరికి ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బు తీసుకున్నాడు. ఎంతకీ ఉద్యోగాలు రాక యువకులు ఒత్తిడి చేయడంతో వారి సొమ్మును సొంత భూమి అమ్మి తిరిగి చెల్లించానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. దాన్ని ఎలాగైనా మళ్లీ సంపాదించాలనే ఆలోచనతో కరీంనగర్‌కు చెందిన మరో ఇద్దరిని అనుచరులుగా చేసుకుని ఎన్‌ఐఏ అధికారుల పేరుతో మోసాలకు పాల్పడేందుకు వరంగల్‌కు వచ్చినట్లు తెలిసింది. పోలీసులు వీరి నుంచి డమ్మీ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని