పుట్టినరోజునాడే విద్యుదాఘాతంతో యువకుడి మృతి

పుట్టినరోజునాడే ఓ యువకుడు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగింది.

Published : 05 Oct 2022 03:54 IST

ఉరవకొండ, న్యూస్‌టుడే: పుట్టినరోజునాడే ఓ యువకుడు విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన అనంతపురం జిల్లా కూడేరు మండలంలో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. గొట్కూరు గ్రామానికి చెందిన నల్లప్ప, ఓబులమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. చిన్నవాడైన కరుణాకర్‌(22) బీటెక్‌ పూర్తి చేశాడు. ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయ పనులు చూసుకుంటున్నాడు. మంగళవారం ఆయన పుట్టినరోజు. వేకువజామునే తోటకు వెళ్లి పంటకు నీరుపెట్టాడు. పూజకు పూలు కోయడానికి పక్కనే ఉన్న తోటకు వెళుతుండగా దారి మధ్యలో వేలాడుతున్న విద్యుత్తు తీగలు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు ఘటనాస్థలానికి చేరుకుని మృతి చెందిన కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించారు. విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యం వల్లనే తమ కుమారుడు మృతి చెందాడని కుటుంబసభ్యులు, గ్రామస్థులు యువకుడి మృతదేహంతో బళ్లారి-అనంతపురం జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని