50 మంది పెళ్లిబృందంతో లోయలో పడిన బస్సు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం ఉదయం పర్వతారోహకులకు జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే.. రాత్రి 7.30 ప్రాంతంలో ఇదే రాష్ట్రంలోని పౌడీ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది.

Published : 05 Oct 2022 05:46 IST

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం

పౌడీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం ఉదయం పర్వతారోహకులకు జరిగిన ప్రమాదం నుంచి ఇంకా తేరుకోకముందే.. రాత్రి 7.30 ప్రాంతంలో ఇదే రాష్ట్రంలోని పౌడీ జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. హరిద్వార్‌ జిల్లాలోని లాల్‌ఢాంగ్‌ నుంచి దాదాపు 50 మంది పెళ్లిబృందంతో వెళుతున్న బస్సు బీరోంఖాల్‌ వద్ద 300 మీటర్ల లోతున్న నాయర్‌ నది లోయలో పడింది. ఇప్పటివరకు ఆరు మృతదేహాలు దొరికాయి. ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా ఉండవచ్చని భావిస్తున్నారు. స్థానికుల సహకారంతో చేపట్టిన సహాయక చర్యలకు చీకటి కారణంగా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రమాదస్థలిలో ఎటువంటి వెలుతురు లేకపోవడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సెల్‌ఫోన్ల ఫ్లాష్‌లైట్‌ వెలుగులో.. బస్సులో చిక్కుకుపోయినవారిని బయటకు తీస్తున్నారు. సమీప ధూమ్‌కోట్‌ ఠాణా నుంచి పోలీసులు బస్సు వద్దకు చేరుకున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ దళాలు ప్రమాదస్థలికి బయలుదేరాయి. ప్రాథమిక విచారణ అనంతరం.. వేగంగా వచ్చిన బస్సు బ్యారియర్లను చీల్చుకొంటూ చెట్టును ఢీకొని లోయలోకి దూసుకుపోయినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని