ఏనుగుల దాడిలో గొర్రెల కాపరి మృతి

చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం జిట్టంవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఏనుగుల దాడిలో గొర్రెల కాపరి కె.గంగయ్య (72) మృతిచెందారు.

Published : 05 Oct 2022 06:09 IST

పెద్దపంజాణి, న్యూస్‌టుడే: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలం జిట్టంవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఏనుగుల దాడిలో గొర్రెల కాపరి కె.గంగయ్య (72) మృతిచెందారు. అటవీ ప్రాంతానికి గొర్రెలను మేతకు తీసుకెళ్లిన కాపరి ఇంటికి వస్తుండగా ఏనుగులు దాడిచేశాయి. వయోభారంతో వేగంగా నడవలేని వృద్ధుడిని ఏనుగులు తొక్కేయడంతో అక్కడికక్కడే మరణించారు. సమీపంలో ఉన్న యువకులు ప్రాణభయంతో పరుగున గ్రామానికి వెళ్లి స్థానికులకు చెప్పారు. వారంతా కలిసి సంఘటనా స్థలానికి వెళ్లబోగా, ఏనుగులు అక్కడే ఉండటంతో మృతుడి వద్దకు చేరుకోలేకపోయారు. ఏనుగుల గుంపు ఘీంకారాలతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయాన్ని గ్రామస్థులు పలమనేరు అటవీశాఖ అధికారులు, స్థానిక పోలీసులకు తెలియజేశారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని