ఓ స్వామీజీ పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడంటూ..

రద్దయిన కరెన్సీ, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ గురువారం ఈ వివరాలు వెల్లడించారు.

Updated : 07 Oct 2022 09:23 IST

ములుగు, న్యూస్‌టుడే: రద్దయిన కరెన్సీ, దొంగ నోట్లను తరలిస్తున్న ముఠాను ములుగు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి.పాటిల్‌ గురువారం ఈ వివరాలు వెల్లడించారు. వెంకటాపురంలో గురువారం  పోలీసులు తనిఖీ చేస్తుండగా రెండు వాహనాల్లో రద్దయిన రూ.వెయ్యి, రూ.500 నోట్లు లభ్యమయ్యాయి. ఈ నోట్ల విలువ రూ.1.65 కోట్లు. సూర్యాపేట జిల్లా కేశవాపూర్‌కు చెందిన పప్పుల నాగేంద్రబాబు, కోదాడ మండలం సాలర్జింగ్‌పేటకు చెందిన శ్రీరాముల నాగలింగేశ్వర్‌రావు, భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన మారె సాంబశివరావు, ములుగు జిల్లా వెంకటాపురానికి చెందిన బెజ్జంకి సత్యనారాయణ, నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఎక్కనాడే గ్రామానికి చెందిన వడ్డి శివరాజ్‌, హైదరాబాద్‌ ఉప్పల్‌ బుద్ధానగర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యుడు గంటా యాదగిరి, మలక్‌పేట బ్యాంక్‌కాలనీకి చెందిన ఠాకూర్‌ అజయ్‌సింగ్‌, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగేంద్రబాబు అప్పులు ఎక్కువ కావడంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వ్యాపారం చేయాలనుకున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు నాగలింగేశ్వర్‌రావు అలియాస్‌ నగేష్‌ను కలిశాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఓ బాబా పాత కరెన్సీని కొత్త నోట్లుగా మారుస్తాడని నాగలింగేశ్వర్‌రావు నమ్మించాడు. దీంతో హైదరాబాద్‌కు చెందిన వెంకట్‌రెడ్డి, నవీన్‌రెడ్డికి రూ.5 లక్షలు ఇచ్చి వారి వద్ద సుమారు రూ.2 కోట్ల రద్దయిన పాత కరెన్సీ, దొంగ నోట్లను కొనుగోలు చేశాడు. ఆ సొమ్మును భద్రాచలం నుంచి వెంకటాపురం మీదుగా హైదరాబాద్‌ తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి పాత కరెన్సీ, దొంగ నోట్లు, రెండు కార్లు, 9 ఫోన్‌లు,రూ.5 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని