ఉగ్ర కుట్ర కేసులో మరో ముగ్గురు?

హైదరాబాద్‌లో దసరా నాడు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో మరో ముగ్గురు అనుమానితులను గుర్తించినట్టు సమాచారం.

Published : 08 Oct 2022 06:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో దసరా నాడు పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో మరో ముగ్గురు అనుమానితులను గుర్తించినట్టు సమాచారం. పండగ వేళల్లో వరుస బాంబు దాడులతో మారణ హోమం సృష్టించేందుకు పథకం వేసిన అబ్దుల్‌ జాహెద్‌, అబ్దుల్‌ సమీయుద్దీన్‌, మాజ్‌ హసన్‌లను ఈ నెల 2న సిట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఉగ్రవాద సంస్థల సహకారంతో పన్నిన కుట్రను పోలీసులు సకాలంలో గుర్తించి భగ్నం చేశారు. ఈ పథకం వెనుక కీలక సూత్రధారులైన ఫర్హతుల్లా ఘోరీ, సిద్ధిఖీ బిన్‌ ఉస్మాన్‌, అబ్దుల్‌ మజీద్‌లు పాకిస్థాన్‌లో తలదాచుకున్నారు. అక్కడి నుంచే ప్రణాళిక రూపొందించి జాహెద్‌తో అమలు చేయాలనుకున్నారు. హవాలా మార్గంలో రూ.33 లక్షలు చేరవేశారు. మనోహరాబాద్‌ నుంచి 4 గ్రనేడ్లను సమీయుద్దీన్‌ తీసుకొచ్చాడు. ఈ వ్యవహారంలో ఇప్పటికే మరో ఏడుగురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కుట్ర అమలుకు స్థానికంగా మరో ముగ్గురు సహకరించారని పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. అరెస్ట్‌కు భయపడిన ఈ ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లినట్టు సమాచారం. అరెస్టయిన ముగ్గురు నిందితులను పోలీసు కస్టడీలోకి తీసుకునేందుకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని