సాధువులపై గ్రామస్థుల మూకదాడి..

పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారన్న అనుమానంతో భిక్షాటనకు వచ్చిన ముగ్గురు సాధువులపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో ఆ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.

Published : 08 Oct 2022 04:24 IST

పిల్లల్ని ఎత్తుకెళ్లే ముఠాగా భావించడంతో దారుణం

పిల్లలను ఎత్తుకెళ్లేందుకు వచ్చారన్న అనుమానంతో భిక్షాటనకు వచ్చిన ముగ్గురు సాధువులపై గ్రామస్థులు దాడి చేశారు. దీంతో ఆ ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ చరోడా గ్రామంలో జరిగింది. ఓ సాధువు ఒక చిన్నారితో మాట్లాడుతుండగా.. ఓ వ్యక్తి పిల్లలను ఎత్తకెళ్తున్నారని కేకలు పెట్టారు. ఇది విన్న గ్రామస్థులు సాధువులను పిల్లల దొంగలుగా భావించి ఒక్కసారిగా వారిపై చేయి చేసుకోవడం, కర్రలతో కొట్టడం ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడ్డ సాధువులను రక్షించి కేసు నమోదు చేసుకున్నారు. సాధువులను రాజస్థాన్‌లోని అల్వార్‌కు చెందినవారిగా గుర్తించారు. వారు ఇప్పటివరకు ఎలాంటి అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడలేదని విచారణలో తేలిందని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని