స్నేహితుల మాటలు విని.. సవతి కుమారుణ్ని కొట్టి చంపాడు
పెద్దయ్యాక తనకు హాని కలిగిస్తాడన్న స్నేహితుల చెప్పుడు మాటలు విని ఓ సవతి తండ్రి రెండున్నరేళ్ల కుమారుడిని కొట్టి హతమార్చాడు.
పెద్దయ్యాక తనకు హాని కలిగిస్తాడన్న స్నేహితుల చెప్పుడు మాటలు విని ఓ సవతి తండ్రి రెండున్నరేళ్ల కుమారుడిని కొట్టి హతమార్చాడు. బాలుడి తల్లిని గదిలో బంధించి ఈ ఘాతుకానికి ఒడిగట్టిన నిందితుడు ఆ తర్వాత మృతదేహాన్ని ఇంట్లోని ఇనుప పెట్టెలో దాచాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మనియార్లో జరిగింది. కొత్వాలీకి చెందిన నిందితుడు ఒకటిన్నర నెల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెకు కూడా ఇదివరకే పెళ్లవ్వగా రెండున్నరేళ్ల కుమారుడు ఉన్నాడు. పిల్లాడు పెరిగి పెద్దవాడయ్యాక నిన్ను చంపేస్తాడంటూ స్నేహితులు చెప్పిన మాటలు నమ్మిన నిందితుడు.. చిన్నారిని కొట్టడం ప్రారంభించాడు. అడ్డుకునేందుకు యత్నించిన బాలుడి తల్లిని ఓ గదిలో బంధించాడు. ఆమె ఎంత అరిచినా పట్టించుకోకుండా బిడ్డను తీవ్రంగా కొట్టి చంపాడు. మృతదేహాన్ని ఇంట్లో ఉన్న ఓ ఇనుప పెట్టెలో దాచాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలోపు నిందితుడు పరారయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్