దివ్యాంగుడిపై సర్పంచి దాడి

దివ్యాంగుడిపై దాడికి పాల్పడుతున్న ఈ వ్యక్తి ఓ గ్రామ సర్పంచి. తనకు ఉపాధి పనుల వివరాలు కావాలని స.హ.చట్టం కింద దరఖాస్తు చేసినందుకే ఈ చర్యకు పాల్పడ్డాడు.

Published : 08 Oct 2022 04:51 IST

అరెస్టు చేసిన పోలీసులు.. ఆపై సస్పెన్షన్‌

న్యూస్‌టుడే, హన్వాడ, మహబూబ్‌నగర్‌ అర్బన్‌: దివ్యాంగుడిపై దాడికి పాల్పడుతున్న ఈ వ్యక్తి ఓ గ్రామ సర్పంచి. తనకు ఉపాధి పనుల వివరాలు కావాలని స.హ.చట్టం కింద దరఖాస్తు చేసినందుకే ఈ చర్యకు పాల్పడ్డాడు. ఈ సర్పంచిని పోలీసులు అరెస్టు చేయగా.. కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా హన్వాడ మండలం పుల్పవానిపల్లిలో గురువారం సాయంత్రం దివ్యాంగుడు కృష్ణయ్య ఇంటి ముందు నుంచి సర్పంచి శ్రీనివాసులు వెళ్తుండగా వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సర్పంచి దివ్యాంగుడిని తన్నడమే కాకుండా మండల అధికారులను దూషించారు. అక్కడే ఉన్న కొందరు సంఘటనను వీడియో తీశారు. శుక్రవారం అది వాట్సప్‌ గ్రూపుల్లో చక్కర్లు కొట్టింది. ఘటనను నిరసిస్తూ మండల వికలాంగుల సంఘం అధ్యక్షుడు వీరేశ్‌ ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోకు స్పందించిన ఎస్పీ వెంకటేశ్వర్లు.. సర్పంచిపై చర్యలు తీసుకోవాలని హన్వాడ పోలీసులకు సూచించారు. ఎస్సై రవినాయక్‌ సర్పంచి శ్రీనివాసులుపై కేసు పెట్టి అరెస్టు చేశారు. ఆ సర్పంచిని కలెక్టర్‌ వెంకట్‌రావు సస్పెండ్‌ చేశారు. దివ్యాంగుడని చూడకుండా విచక్షణ రహితంగా ప్రవర్తించడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని