Andhra News: జలపాతంలో జారిపడి.. అమెరికాలో తెలుగు ఇంజినీరు దుర్మరణం

కెనడాలో ఉండే తెలుగు యువకుడు అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మెకానికల్‌ ఇంజినీరు నెక్కలపు హరీశ్‌ చౌదరి(35) కుటుంబం విజయవాడ శివారులోని పోరంకిలో ఉంటోంది.

Updated : 13 Oct 2022 08:27 IST

పెనమలూరు, పోరంకి, న్యూస్‌టుడే: కెనడాలో ఉండే తెలుగు యువకుడు అమెరికాలోని ఇతాకా జలపాతంలో పడిపోయి మృత్యువాత పడ్డారు. ఏలూరు జిల్లా నూజివీడుకు చెందిన మెకానికల్‌ ఇంజినీరు నెక్కలపు హరీశ్‌ చౌదరి(35) కుటుంబం విజయవాడ శివారులోని పోరంకిలో ఉంటోంది. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక పదేళ్ల క్రితం కెనడాలోని ఆంటారియోకు వెళ్లిన హరీశ్‌ అక్కడ ‘టూల్‌ డిజైనర్‌’గా పనిచేస్తున్నారు. నాలుగేళ్ల క్రితం సాయిసౌమ్యతో వివాహమైంది. ప్రకృతి ప్రేమికుడైన హరీశ్‌ విహారయాత్ర కోసం ఈనెల 8న ఐదుగురు స్నేహితులతో కలిసి అమెరికా వెళ్లారు. 11న న్యూయార్క్‌లోని ఇతాకా జలపాతం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఫొటో దిగుతూ వెనక్కి జారిపడిన హరీశ్‌ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయి మృతి చెందారు. ‘తానా’ సహకారంతో మృతదేహాన్ని స్వస్థలానికి చేర్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని