Hindupuram: రామకృష్ణారెడ్డి హత్య కేసులో మలుపు.. పోలీసుల అదుపులో వైకాపా ఎమ్మెల్సీ పీఏ

వైకాపా అసమ్మతి నేత, హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. వైకాపా నాయకుడు, ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు ప్రైవేట్‌ పీఏగా వ్యవహరిస్తున్న గోపికృష్ణను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం.

Updated : 23 Oct 2022 07:57 IST

నిందితుల ఫోన్‌కాల్స్‌ ఆడియోలు వెలుగులోకి

హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా అసమ్మతి నేత, హిందూపురం నియోజకవర్గ మాజీ సమన్వయకర్త రామకృష్ణారెడ్డి హత్య కేసు విచారణ కీలక మలుపు తిరిగింది. వైకాపా నాయకుడు, ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు ప్రైవేట్‌ పీఏగా వ్యవహరిస్తున్న గోపికృష్ణను శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితులు మంజునాథ అలియాస్‌ వరుణ్‌, మహేశ్‌లతో గోపికృష్ణ మాట్లాడిన ఆడియోలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. తన కుమారుడి హత్యలో ఎమ్మెల్సీ పీఏ పాత్ర ఉందని రామకృష్ణారెడ్డి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అప్పట్లో అతని పేరును ఐదో నిందితుడిగా చేర్చారు. గోపికృష్ణ ఇన్నిరోజులుగా పట్టణంలోనే ఉన్నప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. మిగిలిన నిందితులను 10 రోజులుగా విచారిస్తున్నారు. ప్రధాన నిందితులు వరుణ్‌, మహేశ్‌ మాట్లాడుకున్న ఫోన్‌కాల్స్‌ రికార్డింగ్‌ ఆడియోలను తాజాగా వారి బంధువులు బయటపెట్టినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది. హత్యకు ప్రేరేపించిన వారు తప్పించుకొంటున్నారని, తమ వారే బలి అవుతున్నారన్న ఆందోళనతో వారు ఆడియోలు విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరిన్ని ఆడియోలు ఉన్నాయని, నిందితుల ఫోన్‌కాల్స్‌ డేటా ఆధారంగా పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే కేసులోని పాత్రధారులు, సూత్రధారులు బయటకు వస్తారని మృతుడి కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని