Hyderabad: ర్యాగింగ్‌ పేరుతో సీనియర్ల నరకం.. 34 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నో కొంగొత్త ఆశలతో పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు.

Updated : 01 Nov 2022 07:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌లో మెరుగైన ర్యాంకులు సాధించి ఎన్నో కొంగొత్త ఆశలతో పశువైద్య డిగ్రీ కోర్సులో చేరిన జూనియర్‌ విద్యార్థులకు సీనియర్లు ర్యాగింగ్‌ పేరుతో నరకం చూపించారు. ఈ వేధింపులకు పాల్పడిన 34 మంది విద్యార్థులను తరగతులు, హాస్టళ్ల నుంచి పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం తాజాగా సస్పెండ్‌ చేసింది. వీరిలో 25 మందిని తరగతులు, హాస్టళ్ల నుంచి... మరో 9 మందిని హాస్టళ్ల నుంచి, వర్సిటీ వాహనాలు ఎక్కకుండా నిషేధించింది.

రాజేంద్రనగర్‌లోని వర్సిటీ క్యాంపస్‌ కాలేజీలో  పశువైద్య డిగ్రీ(బీవీఎస్సీ) కోర్సు రెండో, నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ 34 మంది ఇటీవల కొత్తగా చేరిన జూనియర్‌ విద్యార్థులను ర్యాగింగ్‌ పేరుతో నానా రకాలుగా హింసించినట్లు బాధితులు ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ వేసి విచారణ జరిపారు. ర్యాగింగ్‌, హింసించిన తీరును బాధితులు వివరించడంతో బాధ్యులను రెండు వారాల పాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు సోమవారం వర్సిటీ ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి విచారణ జరిపిన తరవాత తదుపరి చర్యలుంటాయని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని