Cherlapalli: వీడియో కాల్‌ చేస్తేనే.. పెరోల్‌కు సహకరిస్తా!

పెరోల్‌ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తొందరగా వచ్చేలా చూడాలంటే.. తనకు వీడియో కాల్‌ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురిచేసిన ఘటన ఇది.

Updated : 02 Nov 2022 08:45 IST

ఖైదీ సోదరికి జైలు అధికారి వేధింపులు

చర్లపల్లి, న్యూస్‌టుడే: పెరోల్‌ కాగితాలు ఉన్నతాధికారులకు పంపించి అనుమతి తొందరగా వచ్చేలా చూడాలంటే.. తనకు వీడియో కాల్‌ చేయాలంటూ ఖైదీ సోదరిని జైలు అధికారి వేధింపులకు గురిచేసిన ఘటన ఇది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎండీ బాషా అనే ఖైదీ చర్లపల్లి కేంద్రకారాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడికి పెరోల్‌ అవకాశం లభించింది. అయితే, త్వరగా ప్రక్రియ పూర్తికావాలంటే తనకు వీడియో కాల్‌ చేయాలంటూ డిప్యూటీ సూపరింటెండెంట్‌ చింతల దశరథం ఖైదీ సోదరికి ఫోన్‌చేసి వేధించడం మొదలుపెట్టాడు. దీని గురించి జైల్లో ఉన్న సోదరుడికి చెప్పుకొని ఆమె విలపించింది. తమ కుటుంబసభ్యులను సదరు అధికారి లైంగికంగా వేధిస్తున్నాడంటూ పర్యవేక్షణాధికారి సంతోష్‌రాయ్‌కి గత నెల 26న ఖైదీ ఫిర్యాదు చేశాడు. వేధింపులు వాస్తవమేనని విచారణాధికారి నివేదిక అందించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ అధికారిని బదిలీ చేస్తున్నట్లు జైళ్లశాఖ డీజీ జితేందర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అతడిపై జైళ్లశాఖ అధికారితోపాటు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని