Missing: తిరుపతిలో అయిదుగురు విద్యార్థుల అదృశ్యం

తిరుపతిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. వీరిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు.

Updated : 10 Nov 2022 09:19 IST

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: తిరుపతిలోని ఒక ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న అయిదుగురు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. వీరిలో ముగ్గురు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. ఇందులో నలుగురు 10వ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. పాఠశాలలో ఉదయం పరీక్షలు రాసి వెళ్లిన విద్యార్థులు తిరిగి రాలేదు. పరిసరాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వరరెడ్డి, ఏఓ మదన్‌మోహన్‌లు పశ్చిమ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

9వ తరగతి విద్యార్థుల ఇంటికి వెళ్లి...

పరీక్ష పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థులు 9వ తరగతి బాలుడి ఇంటికి వెళ్లి, అతనితో మాట్లాడి బయటికి రప్పించారు. తర్వాత ఈ అయిదుగురూ కలిసి మరో 9వ తరగతి విద్యార్థి ఇంటికి వెళ్లి తమతో రావాలని అడిగారు. ఎక్కడికి వెళ్తున్నామని అడిగితే... తమతో వస్తేనే చెబుతామని సమాధానం ఇచ్చారు. దీంతో అతను వారితో వెళ్లలేదు. తర్వాత ఆ అయిదుగురు ఎక్కడికి వెళ్లారో తెలియలేదు. ఘటనపై పశ్చిమ పోలీస్‌స్టేషన్‌ సీఐ శివప్రసాద్‌ మాట్లాడుతూ ‘పిల్లల దగ్గరున్న సెల్‌ఫోన్ల ఆధారంగా వారిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. వారి సామాజిక మాధ్యమాల ఖాతాలనూ, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నాం’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని