కాలుపై అరగంటకు పైగా ఆర్టీసీ బస్సు.. నరకయాతనతో మహిళ మృతి

రోడ్డు ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు అరగంటకుపైగా కాలుపైనే ఉండిపోవడంతో బాధిత మహిళ నరక యాతన అనుభవించి ప్రాణాలు విడిచారు.

Updated : 21 Nov 2022 07:18 IST

బేతంచెర్ల, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదం అనంతరం ఆర్టీసీ బస్సు అరగంటకుపైగా కాలుపైనే ఉండిపోవడంతో బాధిత మహిళ నరక యాతన అనుభవించి ప్రాణాలు విడిచారు. నంద్యాల జిల్లా బేతంచెర్లలో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

సి.బెళగల్‌ మండలం కృష్ణందొడ్డికి చెందిన గొల్ల మద్దిలేటి, గోవిందమ్మ దంపతులు బేతంచెర్లలోని అయ్యలచెరువువద్ద ఉన్న ఓ పరిశ్రమలో పని చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం మద్దిలేటి, గోవిందమ్మ అయ్యల చెరువు నుంచి ద్విచక్ర వాహనంపై పట్టణంలోకి వెళ్తుండగా.. కర్నూలు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వీరి బండిని ఢీకొంది. గోవిందమ్మ కాలి తొడపై బస్సు టైర్లు ఎక్కడంతో తీవ్రంగా గాయపడ్డారు. మద్దిలేటికీ గాయాలయ్యాయి. బాధితురాలిని చికిత్స నిమిత్తం పీహెచ్‌సీకి తరలిస్తుండగా మృతి చెందారు. ఆర్టీసీ బస్సు గోవిందమ్మ కాలుపై నిలిచిపోయిన అనంతరం డ్రైవర్‌ పారిపోవడంతో.. ఎవరి సాయమూ అందక .. అరగంటపాటు అలాగే ఉండిపోవడంతో ఆమె మృతి చెందిందని, వెంటనే తీసి ఉంటే తన భార్య బతికేదని మద్దిలేటి ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని