ఆల్ఫాజియో కంపెనీపై ఈడీ కొరడా

హవాలా మార్గంలో దుబాయ్‌కు సొమ్ము తరలించిన హైదరాబాద్‌కు చెందిన  ఆల్ఫాజియో సంస్థపై  ఈడీ కొరడా ఝళిపించింది.

Published : 24 Nov 2022 04:32 IST

రూ.16 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల జప్తు
హవాలా మార్గంలో దుబాయ్‌కు సొమ్ము తరలించినట్లు గుర్తింపు

ఈనాడు, హైదరాబాద్‌: హవాలా మార్గంలో దుబాయ్‌కు సొమ్ము తరలించిన హైదరాబాద్‌కు చెందిన  ఆల్ఫాజియో సంస్థపై  ఈడీ కొరడా ఝళిపించింది. ఆ సంస్థకు చెందిన సుమారు రూ.16 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను బుధవారం జప్తు చేసింది. దేశవిదేశాల్లో ఆయిల్‌ ఉత్పత్తుల కంపెనీలకు సీస్మిక్‌ సర్వే సేవలందిస్తోన్న ఆల్ఫాజియో సంస్థ ఫెమా ఉల్లంఘనలకు పాల్పడుతోందనే సమాచారంతో ఈడీ చేపట్టిన దర్యాప్తులో అక్రమాలు వెలుగుచూడటంతో ఈ చర్యలు చేపట్టింది. సీస్మిక్‌ సర్వే కోసం  విదేశాల నుంచి తెప్పిస్తున్నట్లు చూపించిన ఈ సంస్థ.. చెల్లింపుల పేరిట అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ గుర్తించింది. దుబాయ్‌లో ఉంటున్న చార్టర్డ్‌ అకౌంటెంట్‌ రాజీవ్‌సక్సేనా నిర్వహిస్తున్న మాట్రిక్స్‌ గ్రూప్‌ డీఎంసీసీ సంస్థ ద్వారా విదేశీ సంస్థలకు చెల్లింపులు చేసినట్లు ఇన్‌వాయిస్‌లు సృష్టించినట్లు తేలింది. కానీ ఆ సొమ్మును ఆల్ఫాజియో సంస్థ ఛైర్మన్‌, ఎండీ దినేశ్‌ అల్లా వ్యక్తిగత అవసరాలకు వినియోగించినట్లు వెల్లడైంది. అలా ఫెమా నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా 25,34,628 డాలర్లను దుబాయ్‌కు తరలించినట్లు ఈడీ గుర్తించింది. ఈ క్రమంలోనే అంత విలువైన ఆల్ఫాజియో సంస్థ ఎఫ్‌డీలను జప్తు చేసింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts