పోలీసుల అదుపులో ‘మల్టీజెట్‌’ ముక్తిరాజ్‌!

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో వేల మందిని ముంచిన మల్టీ జెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ టేకుల ముక్తిరాజ్‌ ఎట్టకేలకు చిక్కాడు. హబ్సిగూడ కేంద్రంగా చీకటి వ్యాపారంతో రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అతన్ని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Published : 25 Nov 2022 03:43 IST

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో రూ.కోట్ల వసూలు

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో వేల మందిని ముంచిన మల్టీ జెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ టేకుల ముక్తిరాజ్‌ ఎట్టకేలకు చిక్కాడు. హబ్సిగూడ కేంద్రంగా చీకటి వ్యాపారంతో రూ.కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన అతన్ని సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. విచారణ ఖైదీగా హైదరాబాద్‌లోని ఓ జైల్లో ఉన్న అతను బయటికొచ్చాక ఆగస్టులో హబ్సిగూడ స్ట్రీట్‌ నం.8లో రియల్‌ లైఫ్‌ ఇన్‌ఫ్రా పేరుతో కార్యాలయం ప్రారంభించాడు. బంగారం, బొగ్గు, గ్యాస్‌పై ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే కమీషన్‌ ఇస్తానంటూ గొలుసుకట్టు విధానంలో వేల మంది నుంచి పెట్టుబడులు స్వీకరించాడు. ఈ చీకటి వ్యాపారం ‘ఈనాడు’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. తమ డబ్బు వెంటనే వెనక్కి ఇవ్వాలంటూ బాధితులు హబ్సిగూడలోని కార్యాలయానికి వెళ్లడంతో ఈ నెల 14న నిందితుడు పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు అతని కోసం గాలించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. మల్టీజెట్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ యాప్‌ ద్వారా అతను రూ.100 కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts