ఎదురు కాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి

ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా కొప్రకోల్‌ సమితి కంద్రబట్ట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం వేకువజామున జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.

Published : 25 Nov 2022 05:10 IST

కటక్‌, న్యూస్‌టుడే: ఒడిశాలోని బొలంగీర్‌ జిల్లా కొప్రకోల్‌ సమితి కంద్రబట్ట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గురువారం వేకువజామున జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి చెందారు. బుధవారం రాత్రి కూంబింగ్‌ చేస్తున్న జవాన్ల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుదాడి చేయడంతో ఇద్దరు మహిళా మావోయిస్టులు చనిపోయినట్లు ఎస్పీ నితిన్‌ తెలిపారు. మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన బొలంగీర్‌-బరగఢ్‌-మహాసమూద్‌(బీబీఎం) డివిజన్‌ సభ్యులని వెల్లడించారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts