నేలవాలిన పంటను చూసి.. కుప్పకూలిన కౌలురైతు

వాయుగుండం ప్రభావంతో రెండ్రోజుల క్రితం వీచిన గాలులకు నేలవాలిన పంటను చూసి మనస్తాపానికి గురైన కౌలు రైతు ఒకరు గుండె ఆగి చనిపోయారు.

Published : 25 Nov 2022 05:10 IST

చుండూరు, అమృతలూరు, న్యూస్‌టుడే: వాయుగుండం ప్రభావంతో రెండ్రోజుల క్రితం వీచిన గాలులకు నేలవాలిన పంటను చూసి మనస్తాపానికి గురైన కౌలు రైతు ఒకరు గుండె ఆగి చనిపోయారు. ఈ ఘటన బాపట్ల జిల్లా అమృతలూరు మండలం మోపర్రులో గురువారం చోటుచేసుకుంది. బాధితులు, తహసీల్దార్‌ కథనం ప్రకారం చుండూరు మండలం ఆలపాడుకు చెందిన ఎ.సుబ్బారావు (47) మోపర్రులో అయిదెకరాలు కౌలుకు తీసుకుని ఖరీఫ్‌లో వరి వేశారు. గాలి, వానకు రెండెకరాల్లో పంట నేలవాలింది. గురువారం పొలం వెళ్లిన సుబ్బారావు దెబ్బతిన్న పంట చూసి మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలారు. పక్క పొలాల్లో రైతులు గమనించి రోడ్డు పైకి చేర్చేటప్పటికే మృతి చెందారు. భార్య సుశీల, బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలున్నారు. అదే సమయంలో అటుగా మోపర్రు వైపు వెళ్తున్న మంత్రి నాగార్జున రోడ్డు పక్కన కౌలు రైతు మృతదేహాన్ని చూసి ఆగారు. కుటుంబ సభ్యులను వివరాలడిగి తెలుసుకున్నారు. వెంటనే చుండూరు, అమృతలూరు తహసీల్దార్లతో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని