దళితుడిని కొట్టి, మూత్రం తాగించి..

చేసిన పనికి డబ్బులు అడిగినందుకు... దళితుడైన ఓ ఎలక్ట్రీషియన్‌ను కులం పేరుతో దూషించడమే కాకుండా, మూత్రం తాగించి, అతని మెడలో చెప్పుల దండ వేసి తీవ్ర అమానుషానికి పాల్పడ్డాడో దాబా యజమాని! 

Published : 26 Nov 2022 06:56 IST

రాజస్థాన్‌లో అమానుషం

జైపుర్‌: చేసిన పనికి డబ్బులు అడిగినందుకు... దళితుడైన ఓ ఎలక్ట్రీషియన్‌ను కులం పేరుతో దూషించడమే కాకుండా, మూత్రం తాగించి, అతని మెడలో చెప్పుల దండ వేసి తీవ్ర అమానుషానికి పాల్పడ్డాడో దాబా యజమాని! రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో ఈనెల 23న ఈ దారుణం చోటుచేసుకొంది. భరత్‌కుమార్‌ (38) అనే వ్యక్తి ఎలక్ట్రికల్‌ పని పూర్తిచేసి, రూ.21,100 బిల్లు వేశాడు. పనిచేయించుకున్న దాబా యజమాని అతనికి రూ.5 వేలు మాత్రమే చెల్లించి, మిగతావి తర్వాత ఇస్తానని పంపేశాడు. పలుసార్లు తిప్పించుకున్నాడే తప్ప డబ్బులు మాత్రం ఇవ్వలేదు. దీంతో భరత్‌కుమార్‌ ఈనెల 23న తనకు రావాల్సిన పైకం చెల్లించాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. ఇందుకు ఆగ్రహించిన దాబా యజమాని, మరో ఇద్దరితో కలిసి అతడిని కొట్టాడు. అక్కడితో ఆగకుండా మూత్రం తాగించి, మెడలో చెప్పుల దండ వేశారు. నిందితులు 5 గంటల పాటు భరత్‌కుమార్‌ను వేధించారని, వారి కోసం గాలిస్తున్నామని సిరోహి డీఎస్పీ శుక్రవారం వెల్లడించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని