Drugs Case: బాలమురుగన్.. గోవా డ్రగ్ డాన్!
దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా లింకులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) ఛేదిస్తోంది. గోవా కేంద్రంగా దందా సాగిస్తున్న కీలక సూత్రధారులు ప్రితీష్ బోర్కర్, డిసౌజా, ఎడ్విన్న్యూన్స్లను ఇప్పటికే పట్టుకోగా.. తాజాగా బాలమురుగన్‌ను కటకటాల వెనక్కి పంపింది.
జాతీయ స్థాయి మత్తు మాఫియాతో లింకులు
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మాదక ద్రవ్యాల సరఫరా లింకులను హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్‌న్యూ) ఛేదిస్తోంది. గోవా కేంద్రంగా దందా సాగిస్తున్న కీలక సూత్రధారులు ప్రితీష్ బోర్కర్, డిసౌజా, ఎడ్విన్న్యూన్స్లను ఇప్పటికే పట్టుకోగా.. తాజాగా బాలమురుగన్‌ను కటకటాల వెనక్కి పంపింది. వీరి సెల్ఫోన్లలో లభించిన జాబితా ఆధారంగా మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్నవారు సుమారు 6000 మంది ఉన్నట్లు అంచనాకు వచ్చింది. 2000-2200 మందికి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చింది. మత్తుకు బానిసలైన 150 మందికి కౌన్సెలింగ్, వైద్యచికిత్స అందిస్తోంది. తమిళనాడుకు చెందిన డ్రగ్ కింగ్‌పిన్ బాలమురుగన్‌ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. హోటళ్లు నడిపిస్తున్న ఇతనికి 15 ఏళ్ల కిందట ఎడ్విన్న్యూన్స్తో పరిచయం ఏర్పడింది. సహచరుడిగా ఉంటూనే డ్రగ్స్ ముఠాలతో పరిచయాలు పెంచుకొన్నాడు. ఆయా రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలకు తన ఏజెంట్ల ద్వారా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. తమిళనాడు, కర్ణాటకల్లో ఐటీ నిపుణులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి, హ్యాష్ ఆయిల్ విక్రయించాడు. పలుమార్లు తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపినా దందా మానుకోలేదు. ఆ రాష్ట్రంలోని కొందరు సినీ, రాజకీయ ప్రముఖులు ఇతని వద్ద ఎండీఎంఏ మత్తుపదార్థం కొనుగోలు చేసేవారని తెలుస్తోంది. మరింత సమాచారం రాబట్టేందుకు అతన్ని కస్టడీలోకి తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.
హోటళ్లే అడ్డాలు
గోవాకు దేశవిదేశాల నుంచి లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడ హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు సందర్శకులతో కళకళలాడుతుంటాయి. మొదట్లో నైజీరియన్లు మత్తు పదార్థాలు విక్రయించేవారు. కాలక్రమంలో కొందరు హోటళ్ల నిర్వాహకులు ఏజెంట్లుగా మారారు. ఇప్పటివరకూ నగర పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల్లో అధిక శాతం హోటళ్ల యజమానులే ఉండటం దీనికి నిదర్శనం. 10-15 ఏళ్లలో జాతీయ స్థాయిలో కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ వంటి సింథటిక్ డ్రగ్స్ సరఫరా చేసేంత స్థాయికి ఎదిగారు. ఆయా ప్రాంతాల్లో పోలీసు, రాజకీయ రంగాలను శాసించే స్థాయికి చేరారంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: లంచ్ బ్రేక్.. అర్ధశతకం దిశగా లబుషేన్.. ఆసీస్ స్కోరు 76/2 (32)
-
World News
Biden: జిన్‌పింగ్‌కు పరిమితులు తెలుసు..: బైడెన్
-
World News
Earthquake: చేజారిన ఆ 72 గంటలు.. తుర్కియే, సిరియాల్లో భారీగా పెరగనున్న మృతులు..!
-
Movies News
Prakash Raj: ‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్‌రాజ్ తీవ్ర వ్యాఖ్యలు
-
World News
Earthquake: అంతులేని విషాదం.. భూప్రళయంలో 15వేలు దాటిన మరణాలు..!
-
Crime News
Kakinada: కాకినాడ జిల్లాలో విషాదం.. ఆయిల్ ట్యాంకర్లో దిగి ఏడుగురి మృతి