ఫోన్‌ కొనేందుకు ఐజీ రివాల్వర్‌ చోరీ

కొత్త ఫోన్‌ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్‌నే కాజేశాడో దొంగ. తన ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.

Published : 27 Nov 2022 03:11 IST

కొత్త ఫోన్‌ కొనడానికి డబ్బులు లేవని ఐజీ రివాల్వర్‌నే కాజేశాడో దొంగ. తన ఇంట్లో పనిచేసే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసు అధికారి వెల్లడించారు. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. పట్నాకు చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌(ఐజీ) వికాశ్‌ వైభవ్‌ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ ఘటనలో షెల్ఫ్‌లో ఉంచిన రివాల్వర్‌, 25 బుల్లెట్లు చోరీ జరిగినట్లు ఐజీ గుర్తించారు. దీనిపై గార్దానీబాగ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఐజీ ఇంటి చుట్టూ అమర్చిన సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. ఐజీ ఇంట్లో పనిచేసే సూరజ్‌ కుమార్‌పై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అతడిని విచారించగా . కొత్త ఫోన్‌ కొనడానికి డబ్బులు లేనందునే ఈ దొంగతనం చేసినట్లు అంగీకరించాడు అనంతరం తన మిత్రుడు సుమిత్‌కు దాన్ని విక్రయించినట్లు తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని