మతం మార్చుకొని పెళ్లి చేసుకో..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఓ మహిళను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి.. ఆ దారుణాన్ని వీడియో తీశాడు.

Updated : 27 Nov 2022 06:15 IST

లేదంటే అత్యాచారం వీడియో బయటపెడతానంటూ బెదిరింపులు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీలో ఓ మహిళను గన్‌తో బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తి.. ఆ దారుణాన్ని వీడియో తీశాడు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని, లేదంటే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతానని ఆ మహిళను బెదిరించాడు. బాధితురాలు తన ఇంట్లో బ్యూటీ పార్లర్‌ నిర్వహిస్తోంది. తరన్నమ్‌, గజాలా అనే ఇద్దరు మహిళలు.. ఆమెతో పరిచయం పెంచుకున్నారు. ఓ సారి బాధితురాలిని తరన్నమ్‌ తన ఇంటికి తీసుకెళ్లి బంధించింది. అప్పుడు ఆమె సోదరుడు అక్లీమ్‌.. బాధితురాలిని అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని అతని ఇద్దరు సోదరీమణులు వీడియో తీశారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని.. లేదంటే అత్యాచార వీడియోను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బాధితురాలిని అక్లిమ్‌ బెదిరించాడు. మత్తుమందు ఇచ్చి ఆమెతో బలవంతంగా పెళ్లి దస్తావేజుపై సంతకం చేయించుకున్నాడు. అనంతరం అక్లీమ్‌ సోదరులు షాదల్‌, విసల్‌ కూడా ఆమెపై  అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 23న బాధితురాలు నిందితుల చెర నుంచి బయటపడి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆరుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని