పసివాడిని బలి తీసుకున్న క్షణికావేశం

తండ్రి క్షణికావేశంవల్ల 3 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.

Published : 27 Nov 2022 04:59 IST

బాలుడి తలను గోడకేసి కొట్టిన తండ్రి

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: తండ్రి క్షణికావేశంవల్ల 3 నెలల పసివాడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయ విదారక ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. పట్టణంలోని వాటర్‌వర్క్స్‌ కాలనీకి చెందిన మునిరాజా పెయింటర్‌. గతేడాది సావిత్రిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి మూడు నెలల కిందట నిఖిల్‌ పుట్టాడు. చలి తీవ్రత కారణంగా ఇటీవల బాలుడు తరచూ అనారోగ్యానికి గురవుతుంటే చికిత్సలు చేయిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి బాలుడికి జ్వరం ఎక్కువైంది. వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లే విషయమై మునిరాజా, సావిత్రి మధ్య గొడవైంది. దీనంతటికీ కారణం నిఖిల్‌ అని భావించిన మునిరాజా ఆవేశానికిలోనై పిల్లాడి కాళ్లు పట్టుకుని తలను గోడకేసి కొట్టాడు. బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని