అరకు ఘాట్‌రోడ్డులో ప్రైవేటు బస్సు దగ్ధం

అరకు లోయ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.

Published : 28 Nov 2022 05:42 IST

అనంతగిరి సమీపంలో అర్ధరాత్రి ఘటన
పర్యాటకులకు తప్పిన ముప్పు

అనంతగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: అరకు లోయ నుంచి వస్తున్న ప్రైవేటు బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఘాట్‌రోడ్డులో.. అనంతగిరి సమీపంలో మూడో నంబరు మలుపు దాటిన తర్వాత ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. విజయనగరం మండలం గొల్లలపేటకు చెందిన 24 మంది పర్యాటకులు ఓ ప్రైవేటు బస్సులో అరకులోయ, బొర్రా గుహలు చూసి తిరుగు ప్రయాణమయ్యారు. టైడా దాటిన తర్వాత వీరి బస్సు వెనకాల చక్రాల మధ్య మంటలు చెలరేగి ఒక టైరు పేలిపోయింది. దీంతో ప్రయాణికులు బస్సును నిలిపివేయాలని డ్రైవరుకు చెప్పారు. అప్పటికే మంటలు తీవ్రం కావడంతో డ్రైవరు ప్రయాణికులందరినీ కిందకు దించేశారు. వెంటనే మంటలు ఎగసిపడి బస్సు పూర్తిగా కాలిపోయింది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నుంచి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. ఎవరికీ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని