పంజాబ్‌లో రైలు ఢీకొని ముగ్గురు బాలల దుర్మరణం

రైలు పట్టాలకు సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు బాలురు ఆదివారం సాయంత్రం పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో దుర్మరణం చెందారు.

Published : 28 Nov 2022 04:23 IST

రూప్‌నగర్‌: రైలు పట్టాలకు సమీపంలో ఆడుకుంటున్న ముగ్గురు బాలురు ఆదివారం సాయంత్రం పంజాబ్‌లోని రూప్‌నగర్‌లో దుర్మరణం చెందారు. వలస కూలీల పిల్లల్లో నలుగురు సట్లెజ్‌ నది వంతెనకు చేరువగా శ్రీకిరాట్‌పుర్‌ సాహిబ్‌లో ఆడుకుంటూ రైలు పట్టాలు దాటే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్యాసింజర్‌ రైలు ఢీకొట్టింది. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా నాలుగో బాలుడు గాయపడ్డాడు. మృతులంతా 7 నుంచి 11 ఏళ్ల లోపువారే. ఘటనపై పంజాబ్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Read latest Crime News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు